– చివరి వన్డేలో శ్రీలంకపై నాలుగు వికెట్ల తేడాతో గెలుపు
చిట్టగాంగ్: శ్రీలంకతో జరిగిన మూడో, చివరి వన్డేలో బంగ్లాదేశ్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో నెగ్గి సిరీస్‌ను 2-1తో చేజిక్కించుకుంది. జహర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో సోమవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో తొలిగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక జట్టు 50 ఓవర్లలో 235పరుగులకు ఆలౌటైంది. లియనగే(101) సెంచరీకి తోడు అసలంక(37), సమరవిక్రమ(29) టాప్ స్కోరర్స్. బంగ్లాదేశ్ బౌలర్లు తస్కిన్ అహ్మద్‌కు మూడు, ముస్తాఫిజుర్, మెహిదీ హసన్‌లకు రెండేసి వికెట్లు, సౌమ్య సర్కార్, రిషాద్‌కు ఒక్కో వికెట్ దక్కాయి. ఆ లక్ష్యాన్ని బంగ్లాదేశ్ జట్టు 40.2ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 237పరుగులు చేసి గెలిచింది.
తంజద్ హసన్(84) అర్ధసెంచరీకి తోడు ముష్ఫికర్ రహీమ్(37), రిషాద్(48) మరో వికెట్ పడకుండా మ్యాచ్ ముగించారు. శ్రీలంక బౌలర్లు లాహిరు కుమారకు నాలుగు, హసరంగకు రెండు వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రిషాద్ హొసైన్‌కు, సిరీస్ నజ్ముల్ హొసైన్‌కు దక్కాయి.