ఢాకా: భారత్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు బంగ్లాదేశ్ జట్టును గురువారం ప్రకటించింది. నజ్ముల్ శాంటో కెప్టెన్‌గా ఎంపిక కాగా.. మర్డర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న షకిబ్ అల్ హసన్‌కు సైతం జట్టులో చోటు దక్కింది. యువ వికెట్ కీపర్, బ్యాటర్ జేకర్ అలీ టెస్టులో తిరిగి చోటు సాధించాడు. భారత్, బంగ్లాదేశ్ తొలి టెస్టు సెప్టెంబర్ 19న చెన్నైలో షురూ కానుండగా.. సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్‌లో రెండో టెస్టు జరుగనుంది. సెప్టెంబర్ 15న బంగ్లా జట్టు చెన్నైకి చేరుకోనుంది.
బంగ్లాదేశ్ టెస్టు జట్టు : నజ్ముల్ శాంటో (కెప్టెన్), మహ్మదుల్ హసన్, జాకిర్ హసన్, ఇస్లామ్, మోమినుల్ హాక్, ముష్ఫీకర్ రహీమ్, షకిబ్ అల్ హసన్, లిటన్ దాస్, మెహిది హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లామ్, నయిం హసన్, నహిద్ రానా, హసన్ మహ్మద్, టస్కిన్ అహ్మద్, సయ్యద్ అహ్మద్, జేకర్ అలీ.