ధర్మశాల : ఐసీసీ ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ బోణీ కొట్టింది. ధర్మశాలలో శనివారం అఫ్గనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గనిస్థాన్ 37.2 ఓవర్లలో 156 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా స్పిన్నర్ మెహిది హసన్ (3/25), షకిబ్ (3/30) మాయ చేశారు. స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 4 వికెట్లు కోల్పోయి 34.4 ఓవర్లలోనే ఛేదించింది. మెహిది హసన్ (57) ఆల్‌రౌండర్ షోతో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలువగా.. నజ్ముల్ (59 నాటౌట్)అజేయ అర్థ సెంచరీతో మెరిశాడు.