నైపియర్: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టి20 బంగ్లాదేశ్ జట్టు సంచలన విజయం నమోదు చేసింది. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన బంగ్లా జట్టు బుధవారం జరిగిన తొలి టి20లో ఐదు వికెట్ల తేడాతో చిత్తుచేసింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ను బంగ్లాదేశ్ బౌలర్లు కట్టడి చేశారు. దీంతో ఆ జట్టు నిర్ణీ 20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 134పరుగులు చేసింది. నీషమ్(48)టాప్ స్కోరర్. బంగ్లాదేశ్ బౌలర్లు ఇస్లామ్‌కు మూడు, మెహిదీ హసన్, ముస్తాఫిజుర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం బంగ్లాదేశ్ ఓపెనర్ లింటన్ దాస్(42నాటౌట్), సౌమ్య సర్కార్(22) బ్యాటింగ్‌లో రాణించడంతో 18.4ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి 137పరు గులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. న్యూజిలాండ్ బౌలర్లు ఇష్ సోథీ, మిల్నే, నీషమ్, బెన్, కెప్టెన్ సాంట్నర్‌కు ఒక్కో వికెట్ దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మెహిదీ హసన్‌కు లభించగా.. రెండో టి20 మౌంట్‌ముఘనైయి వేదికగా శుక్రవారం జరగనుంది.