బంజారా ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం..

నవతెలంగాణ – భీంగల్ రూరల్
భీంగల్ మున్సిపల్ పరిధిలో ఉన్న బంజారా ఉద్యోగులు తమ ఉద్యోగరీత్యా సొంత జిల్లాలో మరి కొంతమంది వేరే జిల్లాలో తమ విధులు నిర్వహిస్తున్నారు. భీంగల్ మున్సిపల్ పరిధిలో ఏర్పాటుచేసిన ఆత్మీయ కలిగిన ఉమ్మడి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో ఉన్న బంజర ఉద్యోగులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అనంతరం కమ్మర్పల్లి ఏఎస్ఓ దేవదాస్ ని సన్మానించడం అలాగే భీంగల్ ఐటిఐ  కాలేజీలో  రెగ్యులర్ అయిన తిరుపతి లెక్చరర్ కూడా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గంగారం, జనరల్ సెక్రటరీ  రాజు, తిరుపతి,దేవదాస్, మూడ్ రమేష్ ,గణపతి ,గణేష్ భీంగల్ మున్సిపల్ పరిధిలో ఉన్న బంజారా ఉద్యోగులు అందరూ పాల్గొనడం జరిగింది.