
నసురుల్లాబాద్ మండలం బొప్పాస్ పల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం మండల ప్రెసిడెంట్ బలరాం సింగ్ నివాసానికి ఏనుగు రవీందర్ రెడ్డి చేరుకొని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా పాలనలో అమలు చేస్తున్న పథకాలను చూసి అభివృద్ధి లో భాగస్వామ్యం అయ్యేందుకు పార్టీ లో చేరుతున్నట్టు బలరాం సింగ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నసురుల్లాబాద్ మండల పార్టీ అధ్యక్షులు నందు టీపీసీసీ ఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు ప్రతాప్ సింగ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్తకొండ భాస్కర్ మాజీ ఎంపీపీ బజ్జ నాయక్,నరేష్ రాథోడ్, గణేష్ తదితరులు ఉన్నారు.