సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా రూ.కోటి విరాళం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ముఖ్యమంత్రి సహాయనిధికి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా రూ.కోటి విరాళం ప్రకటించింది. గురువారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా జనరల్‌ మేనేజర్‌ రితేష్‌ కుమార్‌, డీజీఎం ఎంవీఎస్‌ సుధాకర్‌ చెక్‌ను అందజేశారు.