బ్యాంక్ అధికారులపై విచారణ చేయించాలి..

– మహిళా సంఘాలలో రూ 37 లక్షలు స్వాహ…
– చోద్యం చూస్తున్న అధికారులు..
– అధికారుల తీరుపై మహిళా సంఘాల ఆగ్రహం
– వెంటనే రికవరీ చేయించాలి
– మహిళా సంఘాల డిమాండ్
నవతెలంగాణ- తాడ్వాయి

తాడ్వాయి మండలం నందివాడ గ్రామ సంఘాలలో రూ 37 లక్షలు పక్కదారి పట్టిన విషయం విదితమే. ఈ నిధులు పక్కా ప్రణాళికతో విఈవోగా విధులు నిర్వహిస్తున్న తాటిపాముల బాబా గౌడ్ స్వాహ చేశారు.ఈ విషయం బహిరంగ విచారణలో వెల్లడయింది. అయినా అధికారులు రికవరీ విషయంలో ఏమాత్రం పట్టించుకోవడం లేదు అనే ఆరోపణలు ఉన్నాయి.
చోద్యం చూస్తున్న అధికారులు
– పక్క ప్రణాళికతోనే డబ్బులను దారి మళ్లించినట్లు తేలిన అధికారులు చోద్యం చూస్తున్నారు. వెంటనే వీఎవో ఆస్తులు జప్తు చేయించి డబ్బులు రికవరీ చేయాల్సి ఉండగా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. డబ్బులు రికవరీ చేయాలని మహిళా సంఘాల సభ్యులు కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి అక్కడ రెండు గంటల పాటు బయట నెల పై కూర్చుండి నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ కు వినతిపత్రం అందించి విషయం వివరించారు.స్పందించిన కలెక్టర్ వెంటనే రికవరీ చేయించాలని పిడి సాయన్న ను ఆదేశించారు.పీడీ సాయన్న గ్రామానికి అలా వెళ్లి ఇలా తిరిగి వచ్చారు.
 అధికారుల పాత్ర పై అనుమానాలు
– బహిరంగ విచారణలో డబ్బులు స్వాహా చేశారని తేలిన అధికారులు రికవరీ చేయడంలో జాప్యం చేస్తున్నారు సదరు విఏఓ బాబా గౌడ్ తనను ఏం చేసుకుంటారో చేసుకోండి అన్న రీతిగా తప్పించుకు తిరుగుతున్నాడు బాబాగౌడ్ ఎక్కడ ఉన్న తీసుకు వచ్చి డబ్బులు రికవరీ చేయించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.కానీ అధికారులు బాబాగౌడ్ లేడు కదా మేము ఏమి చేయాలి అంటూ వెళ్ళిపోవటం సిగ్గుచేటు అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే డబ్బులు రికవరీ చేయించాలని మహిళలు డిమాండ్ చేశారు. లేని యెడల తమ ఆందోళనలు మరింత విస్తృతం చేస్తామని హెచ్చరించారు
– వీఎవోతో బాండు రాయించడానికి ప్రయత్నించాం
– రవీందర్ రావు, ఏపీఎం తాడువాయి
– నందివాడ గ్రామ సంఘం విఈఓ బాబాగౌడ్ నుంచి డబ్బుల రికవరీ కోసం బాండు రాయించడానికి శనివారం రోజంతా పీడి కార్యాలయంలో వేచి ఉన్నాం. కానీ బాబా గౌడ్ రాలేదు ఆయన సాయంత్రం వరకు కూడా రాకుండా పోయాడు ఈ విషయం కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్తాం.