ప్రపంచ పౌల్ట్రీ ఉత్పత్తిలో భారతదేశం 5వ స్థానంలో ఉంది. గుడ్ల ఉత్పత్తి లో 3వ స్థానంలో ఉంది. ఏటా పౌల్ట్రీ వ్యాపారం 1,90,500 కోట్ల వ్యాపారం సాగిస్తున్నాం. 2028 నాటికి 3,47,700 కోట్ల వ్యాపారానికి చేరుకుంటుందని ప్రణాళిక రూపొందించారు. 2023-28 సంవత్సరాలకు ప్రణాళిక రూపొం దిస్తూ 10,18 శాతం గ్రోత్‌రేటు పెరుగుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం దేశంలో తమిళనాడు మొదటి స్థానంలో ఉండ గా, వరుసగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. 13 రాష్ట్రాలలో పౌల్ట్రీ ఉత్పత్తులు కొనసాగుతున్నాయి. 2023 సంవత్సరానికి 6,66,753.46 మెట్రిక్ టన్నుల పౌల్గ్రీ మాంసాన్ని ఎగుమతి చేయడం జరిగింది. దీని విలువ 1,081.62 కోట్లుగా ఉంది. ఓమన్, ఇండోనేషియా, మాల్‌దీవులు, యూనైటేడ్ ఆరబ్ ఎమి రేట్స్, జపాన్ దేశాలకు ఎగుమతులు సాగిస్తున్నాం. ప్రపంచంలో అత్యధిక గుడ్ల ఉత్పత్తి పెంపుదల జరుగుతున్నది. బ్రాయిలర్ (38.7శాతం), లేయర్ (29.4శాతం), బ్యాక్‌యార్డ్ (29.8శాతం) మరియు ఇతర కోళ్ళ ఉత్పత్తి (1.43 శాతం) ఉత్పత్తి జరుగుతున్నది. గుడ్ల ఉత్పత్తి 136.60 బిలియన్లుగా ఉంది. 6.19 శాతం ఏటా గ్రోత్‌రేటు పెరుగుతుంది. దేశంలో తలసరి వాడకం సంవత్సరానికి 95 గుడ్లు వాడుతున్నారు. జాతీయ పౌష్టిక ఆహార రికమండేషన్ ప్రకారం 180 గుడ్లు వినియోగించాలి. కానీ ఆర్థిక వనరులు లేకపోవడం వల్ల పేద కుటుంబాలు వాడడం లేదు. లేయర్ జాతీకి చెందిన కోళ్ళు (గుడ్ల కొరకు మాత్రమే) 550 బిలియన్‌ల వరకు ఉన్నాయి. 5.5 లక్షల మంది ఈ పరిశ్రమలో పని చేస్తున్నారు. మొత్తంగానూ, ప్రాసెసింగ్ యూనిట్లతో కలిపి 3 కోట్ల మంది కోళ్ళ పెంపకంలో జీవనం సాగిస్తున్నారు. ఏటా కోళ్ళ మాంసం 4.2 మిలియన్ టన్నులు ఉత్పత్తి అవుతున్నది. మొత్తం పౌల్ట్రీ జనాభ 1,291 మిలియన్‌లు ఉన్నాయి. ఎగుమతులు 28.1 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
బడా కంపెనీల నుండి దిగుమతులు
దేశంలో ఉత్పత్తి బాగా పెరిగి ఎగుమతులు చేస్తున్నప్పటికీ ధనిక దేశాలు మన ఉత్పత్తులను తగ్గించడానికి, రైతులను నష్టపర్చడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. మన ఎగుమతులకు ఆటంకం కల్పించడానికి ”బర్డ్‌ఫ్లూ”, పౌల్ కలరా, తదితర పేర్లతో నిషేదాలు పెడుతున్నారు. ఏటా 240 టన్నుల దిగుమతులు చేస్తున్నారు. ముఖ్యంగా ”కెంటకి ప్రైడ్ చికెన్”తో పాటు (కెఎఫ్‌సి), మరికొన్ని సంస్థలు కోడి కళ్ళను దిగుమతులు చేసుకుంటున్నారు. ప్రపంచంలో కార్గిల్, మిన్నేసోటా, టైసాన్‌ఫుడ్స్, జెబిఎస్, మాల్‌బ్రింగ్ లాంటి సంస్థలు మన దేశ ఎగుమతులకు ఆటంకాలు కల్పిస్తున్నాయి. దేశంలో మరో 14 భారీ సంస్థలు పౌల్ట్రీ వ్యాపారాలు చేస్తున్నాయి. వారు పౌల్ట్రీ పెంచే వ్యవస్థలకు ”చిక్స్” (పిల్లలు), దాణా, మందులు సరఫరా చేస్తున్నారు. 1-2 కిలోలు కోడి పెరిగిన తరువాత కిలోకు 8-10 రూపాయల వరకు చెల్లించి బ్రాయిలర్ కొనుగోలు చేస్తున్నారు. వెంక్కిస్సీ ఇండియా లిమిటేడ్, సుగుణ ఫుడ్స్ లాంటి సంస్థలు వేల కోట్ల వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి. మొదట పేద రైతులు 500 కోళ్ళ నుండి 2000 కోళ్ళ వరకు పెంపుదల చేసి జీవనాదాయం పొందారు. కార్పొరేట్ సంస్థలు ప్రవేశించాక పేద రైతులు ఈ రంగం నుండి నెట్టివేయ బడ్డారు. వేలకోళ్లు పెంచడంతోపాటు భారీ షెడ్‌లు వేసి 15-20 లక్షల పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితికి పౌల్ట్రీ రంగం పెరిగింది. ఇంత భారీ పెట్టుబడి పేదలు పెట్టలేరు. ఒకవైపున దేశంలో ఉన్న పరిశ్రమను భారీ సంస్థలు, కార్పొరేట్లు ఆక్రమిం చడమేగాక, విదేశీ ఎగుమతులకు ఆటంకంగా అనేక జబ్బులను ప్రచారం చేసి నష్టం కలిగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ధనిక దేశాల కుట్రలనుగానీ, కార్పొరేట్ సంస్థల ఆక్రమ చొరబాటుని గానీ నిరోధించలేకపోతున్నది. అందువల్ల ఇప్పటికే ఈ రంగం నుండి చాలామంది దివాళ తీసి ఇతర రంగాలకు వెళ్ళిపోతు న్నారు. అయినప్పటికీ కోళ్ళ ఉత్పత్తిలో 5వ స్థానంలోనూ, గుడ్ల ఉత్పత్తిలో 3వ స్థానంలో కొనసాగుతున్నది. స్థానిక వినియో గాన్ని పెంచడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పౌష్టికాహార లోపాన్ని సరిదిద్దడానికి గుడ్లు మంచి ఆహారం. పాఠశాలలు, దవఖానాలు, అంగన్‌వాడీ కేంద్రాలకు, చౌక డిపోల ద్వారా పేదలకు అందే విధంగా చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం కొనసాగుతుంది. గతంలో గుడ్డు ధర రూ.2లు ఉండగా నేడు రూ.6-7లకు పెరగడంతో పేదల కొనుగోలు తగ్గింది.
మాంసం ఎగుమతులలో మరిన్ని ఆటంకాలు
దేశం నుండి పశుమాంసం (బర్రెలు) రూ.25,648 కోట్లు, గొర్రెల మాంసం రూ.537 కోట్లు ఇతరంగా రూ.6,412 కోట్లు మొత్తంగానూ రూ.32,597 కోట్లు ఎగుమతులు చేస్తున్నాం. హాంకాంగ్, వియత్నం, మలేషియా, ఈజిప్టు, ఇండోనేషియా, ఇరాన్ సౌధి ఆరేబియా, పిలిఫ్పీన్స్, యునైటేడ్ ఆరబ్ ఏమిరేట్స్ దేశాలకు ముఖ్యంగా ఎగుమతులు జరుగుతున్నాయి. వీటికితోడు చేపల ఎగు మతి 17,35,286 మెట్రిక్ టన్నులు రూ.65 వేల కోట్లు కూడ ఎగుమతులు చేస్తున్నాం. ఇందులో 7.11 లక్షల కోట్ల విలువగల రొయ్యలు ఎగుమతులు చేస్తున్నాం. ఈ ఎగుమతులను ఆటంక పర్చడానికి మ్యాడ్‌కౌ, మౌత్ డిసిస్, బ్లూ టంగ్, ఇన్‌ఫ్లూఎంజా తదితర జబ్బులు సోకిన మాంసాన్ని ఎగుమతి చేస్తు న్నారని దుష్ప్రచారం చేసి అంతర్జాతీయంగా ఎగుమతులకు ఆటంకం కల్పి స్తున్నారు. దేశంలో మాంసం ఉత్పత్తి 92.9 లక్షల టన్నులుగా ఉంది. ఏటా 5.62 శాతం గ్రోత్‌రేటు కొనసాగుతున్నది. దేశంలో వినియోగం 40 లక్షల టన్నులు ఉంది. మిగిలినది ఎగుమతులు చేస్తున్నాం. ప్రపంచంలో 6వ స్థానంలో మాంసం ఉత్పత్తి కొనసాగుతున్నది. దేశంలో తలసరి వాడకం సంవత్సరానికి 6.82 కిలోలుగా ఉంది. మహారాష్ట్ర-12.25 శాతం, ఉత్తర ప్రదేశ్-12.14 శాతం, పశ్చిమ బెంగాల్-11.63 శాతం, ఆంధ్రప్రదేశ్-11.04 శాతం, తెలంగాణ-10.82 శాతం ఉత్పత్తి జరుగుతున్నది. పై పరిశ్రమలతో పాల ఉత్పత్తి 22.10 కోట్ల టన్నులతో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్నాం. అయినా పాల ఉప ఉత్పత్తుల దిగుమతులు కొనసాగుతూనే ఉన్నాయి. రాజ స్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ప్రధాన ఉత్పత్తి కొనసాగుతున్నది. పాల తలసరి వినియోగం రోజుకు 444 గ్రాములుగా ఉంది.
పై మాంసాహార ఉత్పత్తులు పెంచడానికి, స్థానిక వినియోగ రేటును పెంచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ప్రణాళికలు రూపొందించడం లేదు. జరిగిన ఉత్పత్తినే అంచనా వేసి గణాంకాలు ప్రకటిస్తున్నారు. కోళ్ళు, మాంసం, చేపలు, పాలు తదితర ఉత్పత్తులలో ఇప్పటికి ఉన్న ఆగ్రస్థానాన్ని మరింత పెంచడంతోపాటు దేశీయ వినియోగం పెంచడం ద్వారా ఈ ఉత్పత్తులు చేసే రైతులకు లాభం కలిగించడంతోపాటు విదేశీ మారకద్రవ్యం కూడా దేశానికి సమకూరుతుంది. కానీ, అంతర్జాతీయ పోటీని తట్టుకోవడానికి తగిన ప్రణాళికలు రూపొందించాలి. బడ్జెట్ కేటాయింపులు చేసి ప్రణాళికలు రూపొందించాలి. వీటి ఉత్పత్తులు పెంచడానికి దేశంలో సరిపడినన్ని మౌలిక వసతులు ఉన్నాయి. కేంద్ర బిజెపి ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని పై ఉత్పత్తులను పదే పదే ప్రకటించింది. కానీ, కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలో ఇందుకు తగిన కేటాయింపులు లేవు. 2022 నాటికే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని 2018లో ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం గడువు తీరినప్పటికీ ఆ వైపు ప్రణాళికలు రూపొందించలేదు. గ్రామీణ ప్రాంతంలో దాదాపు 20 శాతం ప్రజలు ఈ వృత్తులపై ఆధారపడి ఉన్నారు. వీటిని ప్రణాళిక బద్దంగా పెంచడం ద్వారా రైతుల ఆదాయం పెంపుదల చేయడమేగాక, పౌష్ఠికాహార కొరత కూడా తీరుతుంది. ఇందుకు తగిన ప్రణాళికలు రూపొందించాలి.
– సారంపల్లి మల్లారెడ్డి
9490098666