– కేర్ రేటింగ్స్ అంచనా
న్యూఢిల్లీ : వచ్చే ఆర్థిక సంవత్సరం 2024-25లో బ్యాంక్‌ల స్థూల నిరర్థక ఆస్తులు 2.1 శాతానికి పరిమితం కావొచ్చని కేర్ రేటింగ్ ఎజెన్సీ అంచనా వేసింది. 2023-24లో జిఎన్‌పిఎ 2.5-2.7 శాతంగా ఉండొచ్చని.. మొండి బాకీలు మెరుగుపడొచ్చని పేర్కొంది. అంతర్జాతీయ పరిణామాలకు తోడు నగదు లభ్యత మరింత కఠినతరం కావడం, రెగ్యూలేటరీలో మార్పుల వల్ల ఎన్‌పిఎలు తగ్గొచ్చని తెలిపింది. 2013-14లో 3.8 శాతంగా ఉన్న మొండి బాకీలు .. 2017-18 నాటికి ఏకంగా 11.2 శాతానికి ఎగిశాయి. ఆ తర్వాత అనేక పద్దులను మోడీ సర్కార్ పూర్తిగా రద్దు చేయడంతో క్రమంగా ఎన్‌పిఎలు తగ్గుతూ వస్తున్నట్లు కనిపించాయి.