
నవతెలంగాణ – తొగుట
పార్మ కంపెనీ కోసం సేకరించిన భూములను పేద లకు తిరిగి పంచాలని మావోయిస్టుల బ్యానర్ భూములలో ప్రత్యేక్ష మయ్యింది. ఆదివారం హెటి రో ఫార్మా కంపెనీ కోసం సిద్దిపేట జిల్లా తొగుట మండలం పెద్దమాసంపల్లి మధిర గ్రామంలో ఇంది రా నగర్, కొండపాక మండలం సిరిసిరినగండ్ల గ్రామాల్లో గత (10 సంవత్సరాల క్రితం) కంపెనీ యామాన్యం సుమారు 400 ఎకరాలు రైతుల వద్ద నుండి సేకరించారు. మయంలో కంపెనీ యజమా నులు ఫార్మా కంపెనీ నిర్మాణం కోసం భూమీ కొను గోలు చేస్తున్నామని గ్రామస్థులకు తెలియకుండా, మధ్యవర్తుల ద్వారా రైతుల వద్ద నుండి కొనుగోలు చేసి జాగ్రత్త పడ్డా కొంత కాలం తరువాత హేటిరో ఫార్మా కంపెనీ నిర్మాణం జరుగుతుందని గ్రామస్థు లకు తెలియడంతో కంపెనీ కొనుగోలు చేసిన భూముల్లో టెంట్లు వేసి పెద్ద యెత్తున ఉద్యమం చేసి కంపెనీ నిర్మాణం జరుగకుండా చేశారు. ఆ స్థలంలో ఇప్పటివరకు ఎలాంటి నిర్మాణాలు జర గనప్పటికి గత రాత్రి సీపీఐ మావోయిస్టుల పేరిట కంపెనీ భూముల వద్ద ఉన్న గోడలపై రాతలు సంచలం రేపుతున్నాయి. ఆక్రమంగా నిరుపేదల వద్ద భూములను కొనుగోలు చేసి కంపెనీలు కట్టి పెట్టుబడి దారులకు కొమ్ము కాయలని చూస్తే ప్రజా కోర్టులో శిక్ష తప్పదన్న హెచ్చరిక జారీ చేస్తూ పేదల భూమూలను తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేయ డం హేటిరో కంపెనీ భూ యజమనుల్లో ఆందోళన కలిగిస్తుంది.