ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారక్క సన్నిధిలో ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అన్ని మండలాల్లో నుండి ట్రైబల్ జర్నలిస్టులు పాల్గొని,ములుగు జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి ట్రైబల్ వర్కింగ్ జల్దీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బానోతు వెంకట్ నాయక్ హాజరై మాట్లాడుతూ ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలలో జర్నలిస్టు వృత్తిలో ఉన్న గిరిజనులకు తప్పనిసరిగా ప్రాధాన్యం కలిపి ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉంటూ కలం ను నమ్ముకుని జర్నలిస్టుగా కొనసాగుతున్న ఇండ్లు లేని నిరుపేద గిరిజనులకు ఇండ్లు మంజూరు చేయాలని అన్నారు. ఏజెన్సీ జిల్లాలో జిల్లా అక్రిడేషన్ కమిటీలలో గిరిజనులకు ప్రాతినిధ్యం ఉండే విధంగా ప్రభుత్వం చొరవ చూపాలని అన్నారు. వనదేవతల సన్నిధిలో ములుగు జిల్లా ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ నూతన కమిటీని ప్రకటించడం సంతోషంగా ఉందని ములుగు జిల్లా అధ్యక్షులుగా బానోత్ వెంకన్న,ప్రధాన కార్యదర్శిగా చిరంజీవి, కార్యదర్శిగా శరత్, కోశాధికారిగా తురస చంటి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా నేతావత్ సుధాకర్, గౌరవ అధ్యక్షులుగా,భూఖ్య సునీల్, నాయకులను, వైస్ ప్రెసిడెంట్లను పూణెం ప్రతాప్, పోరిక సునీల్, లను మరియు కార్యవర్గ సభ్యులుగా యుగేందర్, తెల్లం ఆనంద్, పాయం అజయ్, వాసం నరేందర్ లను ఎన్నుకోవడం జరిగింది. కమిటీ నిర్ణయాల మేరకు యూనియన్ అభివృద్ధి కోసం మరియు జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు