నవతెలంగాణ – గోవిందరావుపేట
ఎస్ టి యు అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తానని మండల నూతన అధ్యక్షుడు బానోతు విజయ్ అన్నారు. బుధవారం మండలంలోని పసర గ్రామంలో ఎస్టియు మండల శాఖ అత్యవసర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మండల శాఖ నూతన అధ్యక్ష మరియు ప్రధాన కార్యదర్శులను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. ఎస్ టి యు మండల నూతన అధ్యక్షునిగా బానోతు విజయ్ ప్రధాన కార్యదర్శిగా కోరగట్ల రామ్మూర్తి ల ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ సమావేశంనకు ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షుడు శిరుప సతీష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల పారిశుద్ధ్యము కోసం నిధులు కేటాయించడము హర్షణీయం అని అన్నారు అదేవిదంగా పాఠశాల ప్యవేక్షణ కోసం ఎం ఈ ఓ డిప్యూటీ డిఇఓ డి ఈ ఓ పోస్టులను ప్రమోషన్ ల ద్వారా భర్తీ చేయాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఏళ్ళ మధుసూదన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోలం క్రిష్ణయ్య, తాడ్వాయి మండల బాధ్యులు కందిక రాజు, జన్ను శ్యామ్సన్, జిల్లా కార్యవర్గ సభ్యులు బత్తుల సతీష్ కోడూరు సమ్మయ్య, హేమలత, రాజు, ఆదిలక్ష్మి, రవీందర్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.