బాన్సువాడ రెవెన్యూ డివిజన్ లో డిఏఓగా పడాల 

Bansuwada should be DAO in Revenue Divisionనవతెలంగాణ – బాన్సువాడ (నసురుల్లాబాద్)
బాన్సువాడలోని రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో డివిజన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ గా పడాల విజయకుమార్  బాధ్యతలు స్వీకరించారని బాన్సువాడ ఆర్డిఓ రమేష్ రాథోడ్ తెలిపారు. బుధవారం బాన్సువాడ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో నూతనంగా బదిలీపై వచ్చిన విజయ్ కుమార్ రెవెన్యూ డివిజన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించారు. రెవెన్యూ డివిజన్ కార్యాలయ సిబ్బంది వారికి ఘన స్వాగతం పలుకుతూ శాలువతో సన్మానించారు. అలాగే బాన్సువాడ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో విధులు నిర్వహించిన సువర్ణ బదిలీపై కామారెడ్డికి వెళ్లడంతో ఆర్డీవో కార్యాలయంలో వారికి సన్మానించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ రెవెన్యూ డివిజన్ కార్యాలయం అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.