నవతెలంగాణ బాన్సువాడ, నసురుల్లాబాద్ : బాన్సువాడ పురపాలక సంఘం పరిధిలో ఉన్న అతిపెద్ద తై బజార్ వేలం జరిగింది. ఇందులో పాల్గొనే కాంట్రాక్టర్లు
సిండికేట్ గా మారి అతి తక్కువ కోడ్ చేశారని పలువురు ఆరోపిస్తున్నారు. మంగళవారం బాన్సువాడ మున్సిపల్ కార్యాలయం యందు డివిజన్ లోనే పెద్ద తైబజార్ వేలం పాటకు కాంట్రాక్టర్లను ఆహ్వానించారు. ఇట్టి తై బజార్ వేలం 9 మాసంల వరకు మాత్రమే అనగా మార్చి 31 2025 వరకు కొనసాగుతుందని ముందుగానే స్పష్టం చేశారు. ఇందులో మేకల సంత సంతకు రూ. 33 లక్షల 10, వేలు, రోజువారి సంత రూ. 7,లక్షలు, ప్రతి గురువారం నిర్వహించే వారం సంత రూ. 10,లక్షల 10 వెలకు పాట పాడి పైన చెప్పబడిన సంతలను కాంట్రాక్టర్లు పాట పాడి కైవసం చేసుకోవడం జరిగింది. కాంట్రాక్టర్ లందరి సిండికేట్ గా మారి తక్కువ కు వేలంపాట స్వాధీనం చేసుకోవడంపై పలువురు అధికారులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధ ర్, వైస్ చైర్మన్ షేక్ జుబేర్, కమిషనర్ శ్రీహరి రాజు, పురపాలక సంఘం పాలకవర్గం సభ్యులు, కార్యాలయ సిబ్బంది పాల్గొనడం జరిగింది.