బాన్సువాడ ఎమ్మెల్యే సమాచారం కరువు

– ఎమ్మెల్యే పీఏ  నిర్లక్ష్యం..పరిష్కారం కానీ ప్రజా సమస్యలు
నవతెలంగాణ – బాన్సువాడ (నసురుల్లాబాద్)
రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఓ సీనియర్ అధికారిని ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడిగా ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సౌకర్యం కల్పించింది.ఇందులో బాన్సువాడ నియోజకవర్గం మాజీ స్పీకర్ ప్రస్తుత ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కి వ్యక్తిగత సహాయకుడిగా విధులు నిర్వహిస్తున్న బీర్కూర్ మండల రెవెన్యూ ఇన్స్ పెక్టర్  సురేందర్ రెడ్డి పోచరంకు వ్యక్తిగత సహాయకుడిగా విధులు నిర్వహిస్తున్నాడు.  ఎమ్మెల్యే పీఏ  సురేందర్ రెడ్డి తన విధులు మరచిపోయాడని ఆరోపణ ఉంది. బాన్సువాడ నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నప్పటికీ, వ్యక్తిగత సహాయకుడి నిర్లక్ష్యం కారణంగా పోచారం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, సహాయం నియోజక వర్గం  ప్రజలకు తెలియకుండా పోతుందని ఆరోపణ ఉంది.
ఎమ్మెల్యే  సమాచారం కరువు..
ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏ పని చేసిన నియోజక వర్గ ప్రజాప్రతినిధులకు మీడియా, పత్రిక విలేకరులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఎమ్మెల్యే  ఏ సభకు సమావేశాలకు వెళ్లినప్పుడు అక్కడ ప్రజల వినతి, సమస్యలు, ఆర్జీలను తీసుకోని ఎమ్మెల్యే దృష్టికి తీసుక  వెళ్లాల్సి ఉంటుంది.  ఎమ్మెల్యే పోచారం  పర్యటన, సభ సమావేశాల వివరాలను స్థానిక ప్రజాప్రతినిధులకు నాయకులకు కార్యకర్తలకు మీడియా, పత్రిక విలేకరులకు ఒకరోజు ముందు, తరువాత జరిగిన సమావేశం వివరాలను ఎప్పటికప్పుడు తెలుపుతూ ఉండాలి. ప్రజలకు ప్రభుత్వ పథకాల పై అవగాహన కల్పించే విధంగా ఉండవలసిన ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకులు గత కొన్ని రోజులుగా వీటిని మరిచిపోయి తన వ్యక్తిగత పనులు చేసుకుంటున్నారని ఆరోపణ జోరుగా ఉంది. ప్రజల నుంచి వచ్చిన వినతి పత్రాలను తీసుకుంటున్నారు కానీ పరిష్కారంపై పెద్దగా దృష్టి సారించలేకపోతున్నారని. నిజానికి ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చినప్పుడు వాటిని నోట్ చేసుకోవాల్సింది.. వినతి పత్రాలు తీసుకోవాల్సింది పర్సనల్ అసిస్టెంట్లే. ఎమ్మెల్యేలు ఇతర పనుల వల్ల దృష్టి పెట్టలేకపోయినా పీఏలే వాటి సమస్యల పరిష్కారానికి ఫాలో అప్ చేయాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తన వ్యక్తిగత సహాయకులను గాడిలో పెట్టాలంటూ బాన్సువాడ నియోజక ప్రజలకు కోరుకుంటున్నారు.