
– నష్టపరిహారం చెల్లించాలంటూ సీఐటీయూ డిమాండ్
– నష్టపరిహారం చెల్లిస్తామని అధికారుల హామీ
నవతెలంగాణ – బాన్సువాడ (నసురుల్లాబాద్)
చెత్తను తొలగించేందుకు డ్రైనేజీలోకి దిగిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం బాన్సువాడ వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం. బాన్సువాడ కు చెందిన తాళ్ల గంగాధర్ 35 బాన్సువాడ గ్రామపంచాయతీ మరియు మున్సిపాలిటీలో గత 14 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. సోమవారం మహేశ్వరి టాకీస్ ఎదుట ఉన్న డ్రైనేజీ గుంతలోకి దిగి ప్రాణాలు కోల్పోయాడు. ఆచూకీ లేకపోవడంతో మంగళవారం పోలీసులకు సమాచారం అందించడంతో ఆయన ఎక్కడ విధులు నిర్వహిస్తున్న ప్రదేశాన్ని అనుమానంతో డ్రైనేజీ వద్ద చూడగా గంగారం మృతదేహం కనిపించింది. దీనితో మున్సిపల్ కార్మికులు అక్కడికి చేరుకొని అధికారులకు సమాచారం అందించారు. మున్సిపల్ కార్మికులకు ఉద్యోగ భద్రత ప్రమాద బీమా లేకపోవడంతో తమకు నష్టపరిహారం చెల్లించాలంటూ సీఐటీయూ నాయకుడు ఖలీల్ డిమాండ్ చేయడం, సీఐటీయూ నాయకుడు ఖలీల్ మరియు కార్మికులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేయడంతో దిగివచ్చిన అధికారులు నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో కార్మికులు శాంతించి పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతునికి భార్య ఒక కూతురు ఉంది కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాన్సువాడ టౌన్ సిఐ కృష్ణ తెలిపారు.