బార్ అసోసియేషన్ ఎన్నికల షెడ్యూలు విడుదల

నవతెలంగాణ – ఆర్మూర్ 
బార్ అసోసియేషన్ ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల అధికారులు గటడి ఆనంద్, తాళ్ల శ్రీనివాస్  లు ఆదివారం విడుదల చేశారు. వారు మాట్లాడుతూ నేడు , 19,20 న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తామన్నారు 21న స్క్రూట్ ని 22 నాడు నామినేషన్ల ఉపసంహరణ, సాయంత్రం 5గంటలకు అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. 28న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నికల పోలింగ్ జరుగుతుందని చెప్పారు. అదే రోజు సాయంత్రం 3గంటల నుండి ఓట్ల లెక్కింపు నిర్వహిస్తామని చెప్పారు, ఈ కార్యక్రమంలో  అధ్యక్షులు చిన్నారెడ్డి ,బొట్ల జీవన్, ,జక్కుల శ్రీధర్, శ్రీనివాస్, విశ్వనాథ్ ,చరణ్ న్యాయవాదులు పాల్గొన్నారు.