న్యాయవాది రవీందర్ రెడ్డి కి నివాళులర్పించిన బార్ అసోసియేషన్..

నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణ న్యాయస్థానం యందు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ న్యాయవాది రవీందర్ రెడ్డి కి సోమవారం నివాళులు అర్పించారు.. గత శుక్రవారం వారం రోజున పెర్కిట్ గ్రామ నివాసి రవీందర్ రెడ్డి అకాల మరణంతో న్యాయవాదులంరు న్యాయస్థాన విధులను బహిష్కరించి, వారికి నివాళి అర్పించారు. ఆయన అకాల మరణంతో దిగ్బ్రాంతికి గురైనామని అయన మంచితనానికి మరు పేరు అని. అయినా స్మృతులను బార్ అసోసియేషన్ మెంబర్లు గుర్తు చేసుకుని అయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు ఇట్టి కార్యక్రమంలో అధ్యక్షుడు సరసం చిన్న రెడ్డి , వైస్ ప్రెసిడెంట్ సిరియాల జగన్, జనరల్ సెక్రటరీ ఐనారి అశోక్ ట్రెజరర్ దెవరశెట్టి అరుణ్, లైబ్రరీ సెక్రటరీ తుమ్మ సుకేష్ సీనియర్ న్యాయవాదులు భూపతి రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, పండిత్, కిష్టయ్య, మురళీధర్, జూనియర్ న్యాయవాదుల పాల్గొన్నారు..