మేడ్చల్ జిల్లా కూకట్ పల్లి కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న పి.సంతోష్ అనే న్యాయవాదిని బోరబండ ఇన్స్పెక్టర్ జమాల్ బనియన్, లుంగీ పైనే ఇంటి నుండి దారుణంగా ఈడ్చుకెళ్లి న్యాయవాది పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, వేములవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం విధులు బహిష్కరించినట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదుల పై నిత్యం పోలీసుల దౌర్జన్యాలకు నిరసనగా “తెలంగాణ అడ్వకేట్స్ ఫెడరేషన్” ఇచ్చిన పిలుపుమేరకు విధులు బహిష్కరించామని, ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాద రక్షణ చట్టంపై బిల్లు ప్రవేశపెట్టి న్యాయవాదుల పక్షాన డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ప్రతాప సంతోష్, సీనియర్ న్యాయవాదులు నాగుల సత్యనారాయణ ,నేరెళ్ల తిరుమల్ గౌడ్, రేగుల దేవేందర్, పిట్టల మనోహర్, వేముల సుధాకర్ రెడ్డి, పెంట రాజు, నక్క దివాకర్, నాగుల సంపత్, కోడం రత్నయ్య, పిల్లి మధు, బొడ్డు ప్రశాంత్ కుమార్, మాదాసు దేవయ్య, రేగుల రాజ్ కుమార్,దొబ్బల ప్రవీణ్ , మహిళా న్యాయవాదులు అన్నపూర్ణ,పద్మ తోపాటు తదితరులు పాల్గొన్నారు.