నవతెలంగాణ – భగత్ నగర్
కరీంనగర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పీవీ రాజకుమార్ ఆదివారం హై కోర్ట్ జడ్జి ఈవీ వేణుగోపాల్ ను కరీంనగర్ లోని ఆయన స్వగృహం లో కలిశారు. కరీంనగర్ జిల్లా కోర్ట్ లో అదనంగా డొమెస్టిక్ వయోలెన్స్ కేసులు, నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ , చెక్ బౌన్స్ కేసుల సత్వర పరిష్కారానికై అదనపు మేజిస్ట్రేట్ కోర్ట్ లతో పాటు జిల్లా లో అదనపు కోర్ట్ ఏర్పాటు చెయ్యాలని కోరినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు కోర్టుల మంజూరుకు జడ్జి ఈవీ వేణుగోపాల్ కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.