– రైతు రుణమాఫీపై కేటీఆర్ ట్వీట్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు రుణమాఫీ ‘చారనా కోడికి, బారానా మసాలా’ అన్నట్టు ఉందంటూ బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారకరామారావు ఎద్దేవా చేశారు. ఈమేరకు శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. ‘ఊరించి, ఊరించి ఏడునెలలు ఏమార్చి చేసిన రుణమాఫీ తీరు చూస్తే పై సామెత గుర్తు కొస్తుంది. రుణమాఫీ అయిన రైతుల కన్నా కంటతడి పెట్టిన రైతుకుటుంబాలే ఎక్కువ. ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు ఆ పథకానికి మరణ శాసనాలైనవి. అన్ని విధాలా అర్హత ఉన్నా ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పెటోడు లేడు. రైతులు గోడు చెప్పుకు ందామంటే వినేటోడు లేడు. అర్హులైన లబ్దిదారులు రుణమాఫీ కాకపోవడం తో అంతులేని ఆందోళనలో ఉంటే ఎందుకీ సంబరాలు? నలభై లక్షల మందిలో మోజార్టీ రైతులకు నిరాశే మిగిల్చినందుకా? ముప్ఫై లక్షల మంది ని మోసం చేసినందుకా? రెండు సీజన్లు అయినా రైతు భరోసా ఇంకా షురూ చెయ్యలే. జూన్‌లో వేయాల్సిన రైతు భరోసా..జులై వచ్చినా రైతుల ఖాతాలో వెయ్యలే. కౌలు రైతులకు ఇస్తానన్న రూ.15 వేలు ఇయ్యనే ఇయ్యలే. రైతు కూలీలకు రూ.12 వేల హామీ ఇంకా అమలు చెయ్యలే. కాంగ్రెస్ సర్కారు తీరు అటెన్షన్ డైవర్షన్… ఇప్పుడేమో ఫండ్స్ డైవర్షన్’ అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.
చారానా కోడికి..బారానా మసాలా..
1:18 am