పలుచోట్ల ఈవీయంల మొరాయింపు

– ఓటు వేసిన మాజీ మంత్రి మండవ,ఎమ్మెల్సీ విజీ గౌడ్ దంపతులు
నవతెలంగాణ-డిచ్ పల్లి: డిచ్ పల్లి మండలంలో గురువారం ఉదయం ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 5 గంటలలోపు ప్రశాంతంగా ముగియాగా, ఉదయం ఘన్పూర్లో 10 నింషాలు, కమాలాపూర్ గ్రామంలో 20 నిమిషాల పాటు ఒటింగ్ అలస్యంగా ప్రారంభం అయ్యింది. ఈవిఎంలు మొరాయించటంతో పోలింగ్ మందకోడిగా ప్రారంభమై పుంజుకుంది .ఘన్పూర్, కమాలాపూర్ గ్రామాల్లో డీఎల్పీఓ నాగరాజు సందర్శించి ఈవీయంను తిరిగి సెట్ చేశారు. మండలంలోని సుద్దపల్లి గ్రామంలో వికలాంగుల కోసం ఓటు వేసేందుకు ప్రత్యేక బూత్ను ఏర్పాటు చేశారు. ధర్మారం(బి) గ్రామంలో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్రావు దంపతులు, రాంపూర్లో మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్ దంపతులు, నిజామాబాద్ రూరల్ బిజెపి అభ్యర్థి కులచారి దినేష్ కూమార్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి నగేశ్ రెడ్డి తో పాటు ఆయా జిల్లాల, రాష్ట్ర నాయకులు తమ ఓటుహక్కును వినియోగించుకుని పోలింగ్ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.అయా గ్రామాలలో పోలింగ్ కేంద్రం వద్ద ఎలాంటి గొడవలు కాకుండా పోలీసు చెదరగొట్టారు. సుద్దులం గ్రామంలో బిఎస్ఎఫ్ డీఎస్పీ నితీష్ కుమార్ పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. పలు గ్రామాల్లో నూతనంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఖిల్లా డిచ్పల్లి గ్రామంలో యువత కోసం ఓటింగ్ పెంచేందుకు ప్రత్యేక పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. బర్దిపూర్లో వృద్ధులకు ప్రత్యేక వీల్ చైర్ సహాయంతో ఓటు వేశారు. 5 గంటల లోపు పోలింగ్ బూత్లో ఉన్న వారికి రాంత్రి ఎంత సమయం అయిన ఓటు వేసే అవకాశం కల్పించారు. పోలింగ్ నిర్వహణను శాంతి భద్రత పర్యవేక్షణలో ఏసీపీ కిరణ్ కుమార్  అదేశాల మేరకు సీఐ కృష్ణ, ఎస్సై మహేష్ లు పర్యవేక్షించారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. పలు పోలింగ్ కేంద్రాలను అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రాజేందర్ సందర్శించారు.పలు పోలింగ్ కేంద్రాలను బిఅర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు బాజిరెడ్డి గోవర్ధన్, డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి, బిజెపి అభ్యర్థి కులచారి దినేష్ కూమార్ లు పలు కేంద్రాలను సందర్శించారు.