నవతెలంగాణ-మద్దిరాల
ప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధమైన సంఘటన మండలకేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. బాధిత రైతు వల్లపు రమేష్ తెలిపిన వివరాలు ప్రకారం.. తన వ్యవసాయ భావి వద్ద ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరగడంతో గడ్డివాముతో పాటు చుట్టుపక్కల 10 ఎకరాల వరకు కాలిపోయింది. చుట్టుపక్కల రైతులు అప్రమత్తమై చల్లార్చడంతో పెనుప్రమాదం తప్పింది. సుమారు 100 మోపుల గడ్డి కాలిపోయింది.ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరారు.