
– రైతుల ఖాతాల్లో జమ…
– ఏడీఏ రవికుమార్
నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజక వర్గం లోని 5 మండలాల్లో ఎకరం లోపు రెవిన్యూ పట్టా ఉన్న 5232 మంది రైతులకు రూ.9 కోట్ల 92 లక్షల ఆయా రైతుల ఖాతాల్లో జమ అయినట్లు వ్యవసాయ శాఖ అదనపు సంచాలకులు పి.రవి కుమార్ గురువారం తెలిపారు. ఈ నిధులను సాగు నిమిత్తం రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మండలం రైతులు భరోసా
అన్నపురెడ్డిపల్లి 438 83,00,000
అశ్వారావుపేట. 1607 3,45,000000
చండ్రుగొండ 671 94,00,000
దమ్మపేట 1532 2,99,00,000
ములకలపల్లి 984 1,70,00,000
మొత్తం 5232 9,92,00,000