రైతుల ఖాతాల్లో బరోసా నిధులు జమ..

Barossa funds deposited in farmers' accounts..– రైతుల్లో హర్షం: ఏవో శివరాం ప్రసాద్
నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ ప్రభుత్వం లాంచనంగా ప్రారంభించిన రైతు బరోసా కు మండలంలోని తిరుమలకుంట రెవిన్యూ గ్రామం ఎంపికైంది అని,దీని పరిధిలోని రైతుల ఖాతాల్లో నిధులు జమ అయ్యాయని ఏవో శివరాం ప్రసాద్ హర్షం తెలిపారు. ఈ రెవిన్యూ గ్రామం పరిధిలోని తిరుములకుంట, కొత్తమామిళ్ళవారిగూడెం, పాతరెడ్డిగూడెం పంచాయితీలు లో 5818.21 ఎకరాల సాగు భూమికి,1615 మంది రైతుల ఖాతాల్లో రూ.3 కోట్ల,49 లక్షల,9 వేల 272 లు జమ అయినట్లు తెలిపారు.రైతులు ఖాతాల్లో జమ అయినట్లు బ్యాంక్ పంపే సందేశాలు చూసి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.