కులగణనలో మాదిగలు అప్రమత్తతో ఉండాలని భువనగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ అన్నారు. సోమవారం దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలు, పట్టణాల్లో కుటుంబాల వద్దకు వెళ్లి సర్వే నిర్వహించే ఎన్యూమరేటర్స్ సర్వే ఫార్మాట్లోని అన్ని కాలాలను సక్రమంగా నింపే విధంగా ముఖ్యంగా కులం పేరును అడిగి ఆయా కులాలకు సూచించిన కోడ్ ని , అన్ని వివరాలు సరిగ్గా నింపే విధంగా చర్యలు తీసుకోవాలని, సర్వేలో ఎలాంటి తప్పులు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని ఎన్యుమరేటర్ నింపిన సర్వే ఫార్మాట్ ని కుటుంబ సభ్యులు చూసుకునే అవకాశం సమయం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇటికల దేవేందర్ మాదిగ, పట్టణ అధ్యక్షులు పడిగల ప్రదీప్ లు పాల్గొన్నారు.