బాస పోశెట్టి వర్ధంతి సభ..

నవతెలంగాణ -కంటేశ్వర్

ప్రముఖ సామాజిక సేవ కార్యకర్త పద్మశాలి సంఘం వ్యవస్థాపకులు కీర్తిశేషులు బాసపోశెట్టి వర్ధంతి సభను శనివారం మల్లు స్వరాజ్యం ట్రస్ట్ భవనంలో ఘనంగా నిర్వహించారు .వారు చేసిన సేవలను ప్రముఖ వైద్యులు రవీంద్రనాథ్ సూరి కొనియాడారు. అత్యధిక ప్రతిభను కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులకు ఈ సందర్భంగా వారు మెరిట్ స్కాలర్షిప్లను ప్రకటించారు. రాజేశ్వర్ అధ్యక్షతన జరిగిన ఈ వర్ధంతి సభలో 25 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇంకా ట్రస్టు కార్యదర్శి కే రామ్మోహన్రావు సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ బాస పోశెట్టి గారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.