బాస పోశెట్టి సేవలు అజరామరం

నవతెలంగాణ – కంటేశ్వర్
పేద ప్రజల కోసం పద్మశాలి కుల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన బాస పోశెట్టి  23వ వర్ధంతి సభ సోమవారం మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ భవనంలో ఐద్వా మహిళ సంఘం,  బాసపోశెట్టి కుటుంబ సభ్యులు సంయుక్తంగా ఘనంగా నిర్వహించారు. అతిథిగా హాజరైన డాక్టర్ సూరి మాట్లాడుతూ బాసపోశెట్టి పేదల వైద్యం కోసం 30 సంవత్సరాల క్రితమే గుండె జబ్బుల బారిన పడిన పేదల కోసం రెండు లక్షల రూపాయలు ప్రగతి హాస్పటల్ నకు విరాళంగా ఇచ్చారని. ఆ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారన్నారు.పద్మశాలి సంఘం అధ్యక్షులు దీకొండ యాదిగిరి, పులగం హనుమాన్లు, వెంకట నరసయ్య తదితరులు మాట్లాడుతూ.. పేద విద్యార్థుల కోసం హాస్టల్ ను ప్రారంభించారని, చదువుకునే విద్యార్థిని, విద్యార్థులకు ఫీజులు కట్టేవారని అన్నారు. ప్రముఖ న్యాయవాది బాస రాజేశ్వర్ మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించటంతో పాటుగా తమ కుటుంబ సభ్యులందరికీ  ప్రజల కోసం బ్రతకాలని ఉద్భోదించారన్నారు. ఈ కార్యక్రమంలో బాస పోశెట్టి   కుటుంబ సభ్యులు, సరోజ, దక్ష, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు అనిత, ప్రధాన కార్యదర్శి సుజాత ఉపాధ్యక్షురాలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పేద మహిళలకు (26 మంది) విలువైన చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.