
తన గాత్రానికి బెస్ట్ సింగర్ నేషనల్ అవార్డు దక్కిందని అవార్డు గ్రహీత బాసంపల్లి నరేష్ అన్నారు.మండలంలోని వావిలాల గ్రామానికి చెందిన బాసంపెల్లి నరేష్ హైదరాబాదులోని బిర్లా మందిర్ ఆడిటోరియంలో జరిగినగద్దర్ యాద సభలో ప్రపంచ జానపదదినోత్సవాన్ని పురస్కరించుకొని నటుడు ప్రొడ్యూసర్ అంబిక కృష్ణచేతులమీదుగాబాసంపెళ్లి నరేష్ బెస్ట్ సింగర్ నేషనల్ అవార్డును అందుకున్నారనిశుక్రవారంవిలేకరుల సమావేశంలో తెలిపారు.అనంతరం నరేష్ మాట్లాడుతూతనకు పది సంవత్సరాల వయసు నుండిపాటలు పాడుతూ వివిధ నాటకాలలోపాల్గొన్నానని,తన గాత్రంతోచాలామందిని మెప్పించానని అన్నారు.తనగాత్రానికి భవిష్యత్తులోసినిమాలలో టీవీ షోలలోఅవకాశాలురావాలని కోరారు.ఈఅవార్డు కార్యక్రమంలోనరేష్ తల్లిదండ్రులుబాసంపల్లి వెంకన్న సారమ్మ,రాజు, స్రవంతి,తన భార్య మౌనిక కూతురు సహస్ర లుపాల్గొన్నారు. నా గాత్రాన్ని ప్రోత్సహించాలనుకునేవారు,ఒక అవకాశం ఇవ్వాలనుకునేవారు,గాత్రం ప్రతిభరెండుఉన్నబాసంపల్లి నరేష్ కి అవకాశం కల్పించాలని గ్రామస్తులు కోరారు.ఆకాశం ఇవ్వాలనేవారు 9550077518 నెంబర్ కి ఫోన్ చేయాలని కోరారు.