నవతెలంగాణ-హైదరాబాద్ : , బిఎఎస్‌ఎఫ్ తన ‘వా రే కిసాన్’ ‘రైతుకు వందనం’) ప్రచారం. బిఎఎస్‌ఎఫ్ యొక్క ‘పుడమిపై అతి గొప్ప పని’ ప్రచారంలో ఈ ప్రచార కార్యక్రమం భాగంగా ఉంది మరియు తమ సమాజంలో మరియు భారతీయ వ్యవసాయ రంగంలో మార్పు తీసుకొస్తున్న 5 మంది రైతులను హైలైట్ చేసి భారతీయ రైతులకు చూపించాలనుకుంటోంది.
ప్రచారం చేపట్టేందుకు శ్రీ అన్నూ కపూర్‌ని బిఎఎస్‌ఎఫ్ నియమించింది. దీని ఎపిసోడ్‌లు బిఎఎస్‌ఎఫ్ యొక్క యూట్యూబ్ మరియు ఫేస్‌బుక్ చానల్‌ళ్ళలో ప్రత్యేకంగా ప్రసారం చేయబడతాయి. సీరీస్‌ని ప్రారంభించడానికి ముందు, తమ కథలు సమర్పించవలసిందిగా రైతులను ఆహ్వానిస్తూ నెల రోజుల పాటు సామాజిక మాధ్యమంలో ప్రచారం చేపట్టిన ఫలితంగా ‘వా రే కిసాన్’ ప్రచారానికి అత్యంత స్ఫూర్తిదాయక కథలు ఇచ్చిన 5 మంది రైతులను ఎంపికచేయడమైనది.
”ది బిగ్గెస్ట్ జాబ్ ఆన్ ఎర్త్” అనేది బిఎఎస్‌ఎఫ్ అగ్రికల్చరల్ సొల్యూషన్స్ అండ్ ఫార్మర్స్ డిజర్వ్ మోర్ విజిబిలిటి అండ్ అప్రిసియేషన్ అనే అంతర్జాతీయ ప్రచారం. వైవిధ్యమైన భౌగోళిక మరియు వ్యవసాయ పద్ధతులు గల భారతదేశంలో, ”వా రే కిసాన్” లో ప్రదర్శితమైన 5 మంది వినూత్నమైన రైతులను కలుసుకోగలిగినందుకు నాకు సంతోషంగా ఉంది మరియు వ్యవసాయంలో అందరికీ సుస్థిరమైన భవిష్యత్తు కల్పించేందుకు మేము పనిచేసేటప్పుడు మరింత మంది రైతులు స్ఫూర్తి పొంది ముందుకు వస్తారని నేను ఆశిస్తున్నాను, అన్నారు లివియో టెడెస్కి, ప్రెసిడెంట్, అగ్రికల్చరల్ సొల్యూషన్స్ బిఎఎస్‌ఎఫ్ ఎస్‌ఇ.
- ఎపిసోడ్ ఒకటి: పంట కోసిన తరువాత రైతులకు కలిగే నష్టాన్ని తగ్గించేందుకు సహాయపడే ఖర్చు తక్కువ మరియు ఎనర్జీని పొదుపు చేసే సోలార్ డ్రైయర్‌ని కనుగొనుట. (శ్రీ తుషార్ గవారీ, మహారాష్ట్ర)
- ఎపిసోడ్ రెండు: వినూత్న పద్ధతులతో ఏకీకృత వ్యవసాయాన్ని ప్రవేశపెట్టడం ద్వారా తన వ్యవసాయ భూమిని మాత్రమే కాకుండా తన గ్రామం మొత్తాన్ని మార్చేసిన రైతు కథ. (శ్రీ మంజన్న టి.కె., కర్ణాటక).
- ఎపిసోడ్ మూడు: భారతదేశపు స్థానీయ వరి రకాలను పరిరక్షించడంలో గణనీయమైన పాత్ర పోషించిన రైల్ లైబ్రరి. (శ్రీ మహాన్ చంద్ర బోర, అస్సాం).
- ఎపిసోడ్ నాలుగు: సాంప్రదాయ పంట వ్యవస్థలతో నీటి కొరతను ఎలా పరిష్కరించడానికి వైవిధ్యమైన వ్యవసాయం సహాయపడుతుందో చూపించింది. (శ్రీ శర్వాన్ సింగ్ చాంది, పంజాబ్).
- ఎపిసోడ్ అయిదు: సాంప్రదాయ యాపిల్ సాగును వినూత్నమైన తక్కువ చిల్లింగ్ యాపిల్ రకంతో రీడిఫైన్ చేసింది. (శ్రీ హారిమన్ శర్మన్, హిమాచల్‌ప్రదేశ్).
‘మేము ‘వా రే కిసాన్’ ని ప్రారంభించినందుకు మరియు భారతదేశ వ్యాప్తంగా రైతులు సాధించిన ఘన విజయాల సంబరాలు చేసుకుంటున్నందుకు మేము సంతోషిస్తున్నాము,” అన్నారు గిరిధర్ రాణువ, బిజినెస్ డైరెక్టర్, బిఎఎస్‌ఎఫ్ అగ్రికల్చరల్ సొల్యూషన్స్ ఇండియా. ”వా రే కిసాన్” వీక్షకుల సంఖ్య ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో 35 మిలియన్‌లకు చేరుకుంది, మరియు రైతులు ఎదుర్కొంటున్న సవాళ్ళపై శ్రద్ధపెట్టడం ముఖ్యమని నేను నమ్ముతున్నాము. ఇన్ఫోటెయిన్‌మెంట్ ఎపిసోడ్‌ల ద్వారా, మేము మన రైతుల యొక్క అత్యంత సృజనాత్మక కృషిని సంభాషిస్తాము, నగరాల్లో నివసించే అనేక మంది నుంచి వీటికి సులభంగా ఆమోదం లభిస్తుందని మేము ఆశిస్తున్నాము, ఎందుకంటే ఆహారం ఉత్పత్తిలో వీళ్ళు భాగస్వాములు కాదు కాబట్టి.
అయిదు రైతు కథలకు ప్రఖ్యాత భారతీయ సినీ మరియు టెలివిజన్ నటుడు శ్రీ అన్నూ కపూర్ హోస్ట్ చేశారు మరియు ఇక్కడ లభిస్తోంది: బిఎఎస్‌ఎఫ్ ఆగ్రో ఇండియా-యూ ట్యూబ్. 2025 సంవత్సరంలో రాబోవు నెలల్లో, ”వా రే కిసాన్” రెండవ సీజన్‌లో భిన్న కథలతో కొత్త రైతుల కథలను చిత్రీకరించాలని బిఎఎస్‌ఎఫ్ ప్రణాళిక చేస్తోంది.