– రాష్ట్ర మహిళా శిశుసంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి వాకాటి కరుణ
– జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్
– వీడియో కాన్ఫరెన్స్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ శశాంక
నవతెలంగాణ రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
అంగన్‌వాడీ కేంద్రాలలో పూర్వ ప్రాథమిక విద్య ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి వాకాటి కరుణ అన్నారు. మంగళవారం వాకాటి కరుణ అం గన్‌వాడీ కేంద్రాల అభివృద్ధిపై రాష్ట్రస్థాయి ఉన్నతాధికా రులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 5 నుంచి 6 సంవత్సరాలుగా పిల్లల సంక్షేమం కోసం కషిచేసిన ప్రముఖమైన స్వచ్ఛంద సంస్థల సహకారంతో అంగన్ వాడి సెంటర్ల అభివద్ధి కార్యాచరణ, పిల్లలకు నేర్పాల్సిన పాఠ్యాంశాలు, పిల్లల అభివృద్ధి తీసుకోవా ల్సిన చర్యల ప్రణాళిక రూపొందించామని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలను దృష్టిలో ఉంచు కొని చిన్న వయసులో పిల్లలకు నేర్పాల్సిన వ్యక్తిగత పరి శుభ్రత, అంశాలు, నైపుణ్యాలతో కోర్సు సిద్దం చేశామని, అంగన్‌వాడీ సెంటర్లలో పిల్లలకు నేర్పించాల్సిన అంశా లను వివరిస్తూ అంగన్ వాడీ టీచర్లకు ప్రత్యేక బుక్ లెట్ రూపొందించామని, జూలై మొదటి వారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ టీచర్లకు పూర్వ ప్రాథమిక విద్య పై శిక్షణ పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆమె సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ శశాంక సంబంధిత అధి కారులతో మాట్లాడుతూ జిల్లాలోని 1600 అంగన్‌వాడీ కేంద్రాలను ప్రతి రోజూ తెరవాలని, అంగన్‌వాడీ కేం ద్రాల ద్వారా పిల్లలకు పోషక విలువలతో కూడిన పౌష్ఠిక ఆహారం అందించాలని తెలిపారు. చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, పిల్లలలో ఎత్తు బరువు పెరు గుదలకు, రక్తహీనత లేకుండా బలవర్ధకమైన పౌస్టికా హారం అందించాలని, రక్తహీనత ఉన్న మహిళలు, బాలి కలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రతి సూప ర్‌వైజర్ ఇంటింటికీ వెళ్లి బలహీనంగా ఉన్న పిల్లలను గుర్తుంచి బలవర్ధకమైన పౌష్ఠిక ఆహారం అందించేలా తల్లులకు అవగాహన కలిపించాలని, జిల్లాలో ఎస్ ఏఎం( అతితీవ్ర లోప పోషణ) ఎంఎఎం (తీవ్ర లోప పో షణ) లేకుండా చేయాలని సంబంధిత సీడీపీఓలు, సూపర్‌వైజర్లుకు ఆదేశించారు. బలహీనంగా, ఎదుగు దల, బరువు తక్కువగా ఉన్న పిల్లలకు పౌష్టిక ఆహారం తోపాటు, అంగన్‌వాడీలలో బాలామృతాన్ని కచ్ఛితంగా అందించాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా సంక్షేమ అధికారి పద్మజ రమణ, సీడీపీఓలు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.