లోక్‌సభ ఎన్నికలు మూడు పార్టీలకు ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా తయారయ్యాయి. బస్తీమే సవాల్ అన్నట్టుగా మారిన ముచ్చట ఎరుకే కదా ! ఉత్తరాన ఆశలు ఆవిరవుతున్న కొద్దీ దక్షిణాదిపై బీజేపీ కన్నేసింది. అందునా తెలంగాణలో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడింది. ఇక బీఆర్‌ఎస్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారే. కూతురు పోయి జైల్లో ఉండే, ఎంపీ సీట్లకు పోటీచేస్తేందుకు కూడా కేసీఆర్ పార్టీ అభ్యర్థులు సైతం వెనకడుగు ఏసిరి. ఎన్నికల ఖర్చు, ప్రచారమూ మాదే అంటనే బలవంతంగా కొందరు ‘కారు’ ఇంటి నుంచి బయటకు తీసిర్రు. ఇక కాంగ్రెస్‌కు ఈ ఎన్నికలు ప్రెస్టీజ్‌గా మారే. ఎట్టాగైనా సరే ఇక్కడ రెండు డిజిట్ల సీట్లను గెలవాలే, ఢిల్లీలో రాహుల్‌ను ప్రధాన్నిజెయ్యాలే అనే పంతంతో ఉంది. ఈ మూడు పార్టీలు పైసల్ విపరీతంగా ఖర్చుపెట్టబట్టే. అక్కడ మోడీకి అంతా సజావుగా లేకపోగా, ఇక్కడ కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు అడకత్తెరలో పోకచెక్కలా మారింది పరిస్థితి. హత విధీ !
– బి. బసవపున్నయ్య