మండల కేంద్రం శివారులోని కొండ లక్ష్మణ్ పసుపు పరిశోధన స్థానం శుక్రవారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పసుపు పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త మహేందర్ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బతుకమ్మ అంటే పూల పండుగ అన్నారు. పకృతిలో లభించే పూలన్నింటిని పేర్చి మహిళలు సంబరంగా జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ అన్నారు.బతుకమ్మ పండుగ అంటే మహిళలకు ఎంతో ఇష్టమైన పండుగని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని మహిళలందరికీ ఆయన బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో శ్రీనివాస్, శంకర్, సుభాష్, పరిశోధన స్థానంలో పనిచేసే మహిళ కూలీలు, తదితరులు పాల్గొన్నారు.