ఘనంగా బతుకమ్మ సంబరాలు

నవతెలంగాణ – గోదావరిఖని
గోదావరిఖనిలోని 48వ డివిజన్ లో బతుకమ్మ సంబరాలు కార్పొరేటర్ పొన్నం విద్య లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా కార్పొరేటర్ పొన్నం విద్యా లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చినంక బతుకమ్మకు గౌరవం దక్కిందనీ, పువ్వులను పూజించే బతుకమ్మ కు తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ బతుకమ్మకు పెద్దపీట వేయడం తెలంగాణ ప్రజలకు ఎంతో సంతోషకరం అని అన్నారు. ఈ కార్యక్రమంలో 48వ డివిజన్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.