పాఠశాలల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

నవతెలంగాణ పెద్దవంగర:
మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో గురువారం ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వేడుకల్లో విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు బుదారపు శ్రీనివాస్ మాట్లాడుతూ.. బతుకమ్మ అంటే ప్రకృతిని ప్రేమించే పండుగ అని అన్నారు. ప్రకృతిని రక్షించుకోవడం ద్వారా మన భవిష్యత్‌ తరాలు బాగుంటాయని తెలిపారు. విద్యార్థినులు బతుకమ్మను పేర్చి ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజలింగం, సదయ్య, టకీ పాషా, అంజయ్య, యాకయ్య, విజయ్ కుమార్, శ్రీధర్, సువర్ణ, కరుణ, హైమ, గౌరీ శంకర్, షౌకత్ అలీ, వెంకన్న, శ్రీనివాస్ పాల్గొన్నారు.