అసెంబ్లీ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు

Bathukamma celebrations at Assembly Officeనవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ కార్యాలయం మంగళవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ పండుగ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే  బీర్ల ఐలయ్య, ఆయన సతీమణి అనిత, సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ రాగమయి దయానంద్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాగమయి దయానంద్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సతీమణి అనిత గారు అసెంబ్లీ మహిళ ఉద్యోగస్తులతో కలసి బతుకమ్మ ఆడారు.