బిట్స్ లో బతుకమ్మ సంబరాల

నవతెలంగాణ -పరకాల: స్థానిక పరకాల పట్టణంలోని బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ పాఠశాలలో ముందస్తుగా ఘనంగా బతుకమ్మ సంబరాలు జరిపారు. విద్యార్థులందరూ సాంప్రదాయ దుస్తులు ధరించి రంగురంగుల పూలతో పేర్చినటువంటి బతుకమ్మలను తీసుకువచ్చారు తెలంగాణ సంస్కృతికి అపూర్వమైన బతుకమ్మ పాటలు పాడుతూ గౌరీ మాత అందానికి శాశ్వత వైభవానికి ప్రతీకగా భావించే బతుకమ్మను రూపొందించే విశేషాలను విద్యార్థులు ఎంచుకొని బతుకమ్మల చుట్టూ ఆడుకోవడంలో వాతావరణం ఉల్లాసంగా మారింది విద్యార్థులు అందరూ బతుకమ్మ చుట్టూ కోలాటం చేస్తూ ఆడుతూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తధానంతరం బాలాజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ బతుకమ్మ ప్రకృతితో ముడిపడిన పండుగ పువ్వులనే దేవుడిగా కొలవడం  తమ బతుకులను పాటలుగా పాడుకోవడం ప్రతీతి ఇది అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే బతుకమ్మ పండుగ అని  బతుకమ్మ పేర్చటంలో వాడే ఆకులు, పూలు మంచి ఔషధాలు వీటిని చెరువులో కలపడం వల్ల నీటి శుద్ది జరుగుతుందని అందుకే బతుకమ్మ పండుగ ప్రకృతి పండుగ అని  విద్యార్థులందరూ కూడా పువ్వుల్లా వికసించాలని మాట్లాడారు .ఈ కార్యక్రమంలో భాగంగా ప్రిన్సిపాల్ జోసెఫ్ గారు ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.