నవతెలంగాణ- కౌడిపల్లి
మండల కేంద్రమైన కౌడిపల్లి లోని గిరిజన సంక్షేమ గురుకులంలో సోమవారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కళాశాల మహిళా ఉపాధ్యాయినిలు వివిధ రకాల రంగుల పూలతో బతుకమ్మను పేర్చి, బతుకమ్మ పాటలకు అనుగుణంగా నృత్యం చేశారు. అనంతరం ప్రిన్సిపల్ ఫణి కుమార్ తో పాటు ఉపాధ్యాయులు, వివిధ తరగతుల విద్యార్థులు, మహిళా ఉపాధ్యాయినిలు బతుకమ్మ నృత్యాలలో పాల్గొన్నారు. మంగళవారం నుండి పాఠశాల కళాశాలకు దసరా సెలవుల సందర్భం గా చివరి పనిదినం కావడం తో..విద్యాసంస్థ లో అందరూ కలిసి జరుపుకున్న ఈ పండుగ సందర్భంగా, బతుకమ్మ పాటలు, విద్యార్థుల కేరింతలతో కౌడిపల్లి పాఠశాలలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి కౌడిపల్లి గ్రామానికి చెందిన పలువురు పెద్దలు రావటం విశేషం. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఫణి కుమార్ వైస్ ప్రిన్సిపల్ నరసింహ జూనియర్ వైస్ ప్రిన్సిపల్ భవాని తోపాటు కళాశాల పాఠశాల మహిళ ఉపాధ్యాయినిలు, ఉపాధ్యాయ అధ్యాపకబృందం, విద్యార్థులు పాల్గొన్నారు.