జ్ఞానోదయ పాఠశాలలో ఘనంగా నిర్వహించిన బతుకమ్మ పండుగ

నవతెలంగాణ- మోపాల్ : మోపాల్ మండలంలోని మంచిప్ప గ్రామంలో గల జ్ఞానోదయ హై స్కూల్ లో మొదటిరోజు బతకమ్మ సంబరాలను విద్యార్థులు,  ఉపాధ్యాయులు కలిసి ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయ దంపతులు దేవ శంకర్ మరియు లక్ష్మి తదిత ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా దేవ శంకర్ మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచుల పండుగ బతుకమ్మ పాఠశాలల్లో ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తామని అలాగే బతుకమ్మ గొప్పతనం మరియు తెలంగాణ సంస్కృతి గురించి విద్యార్థులకు తెలియజేస్తూ పండగ సంప్రదాయాల గురించి కూడా విద్యార్థులకు వివరించారు.