బతుకమ్మ సంబరాలలో భాగంగా మంగళవారం మండల ప్రజాపరిషత్ కార్యాలయము గోవిందరావుపేట నందు మహిళా ఉద్యోగులతో బతుకమ్మ సంబరాలు కార్యక్రమము ఎంపీడీవో జి జవహర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనైనది. మహిళా ఉద్యోగులు కోలాటం నృత్యాలతో బతుకమ్మ పాటలో పాడుతూ అలరించారు. అనంతరం నీటి కాలువలో వదిలినారు. ఈ కార్యక్రమంలో మహిళా ఉద్యోగులు శ్రీమతి కే సాయి దుర్గ లక్ష్మీ సూపరిండెండెంట్, ఏ ప్రసూన ఏపీవో ఈజీఎస్, మరియు మహిళా పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.