తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం బతుకమ్మ 

Bathukamma is a reflection of Telangana culture– ఐసీడీఎస్, సీడీపీఓ మల్లీశ్వరి 
– తాడ్వాయి ఐసీడీఎస్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు 
నవతెలంగాణ – తాడ్వాయి 
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబం బతకమ్మ సంబరాలని తాడ్వాయి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సీడీపీఓ మల్లీశ్వరి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఐసీడీఎస్ కార్యాలయంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని తాడ్వాయి, గోవిందరావుపేట్ మండలాల అంగన్వాడీ టీచర్లు, మహిళా ఉద్యోగులతో తెలంగాణ అతిపెద్ద పండుగైన బతుకమ్మ సంబరాలను ఆటపాటలతో, నృత్యాలతో ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా సీడీపీఓ మల్లీశ్వరి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోనే కాక ప్రపంచ దేశాలలో బతుకమ్మ పర్వదిన వేడుకలు నిర్వహించుకుంటున్నామన్నారు. తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ అపురూపమైన పండుగ అని ఈ పండుగ మనందరిలో గొప్ప శక్తిని దాగి ఉన్న సామర్థ్యాన్ని వెలికితీస్తుందన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్లు భాగ్యలక్ష్మి, శారద, రజిత, పోషణ అభియాన్ కోఆర్డినేటర్ శ్రావణి, జూనియర్ అసిస్టెంట్ శిరీష, అంగన్వాడి టీచర్లు సరోజన, జమున, సమ్మక్క, సరిత, పద్మారాణి, తాడ్వాయి, గోవిందరావుపేట్ మండలాల 95 మంది అంగన్వాడి టీచర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.