హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు కట్ట, ఆరపల్లె లో బతుకమ్మ పనులను గురువారం మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న పరిశీలించారు. బతుకమ్మ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 22 అక్టోబర్ బతుకమ్మ పండుగ, 23 అక్టోబర్ దసరా పండుగ ఘనంగా నిర్వహించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఐలేని అనిత శ్రీనివాస్ రెడ్డి , కౌన్సిలర్లు పున్న లావణ్య, బొల్లి కల్పన శ్రీనివాస్, మ్యా దరబోయిన శ్రీనివాస్, మేదరబోయిన వేణు, మాజీ ఎంపీపీ ఆకుల వెంకన్న, ఐలేని శంకర్ రెడ్డి, యండి అయూబ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.