బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్‌ చైర్మన్‌

నవతెలంగాణ-ప్రజ్ఞాపూర్‌
మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌ ఊర చెరువు వద్ద బతుకమ్మ ఏర్పాట్లను శనివారం మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్‌.సీ రాజమౌళి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు సద్దుల బతుకమ్మ సందర్భంగా మహిళలు పిల్లలు పెద్ద ఎత్తున చెరువు వద్దకు వస్తారని వారికి కావలసిన ఏర్పాట్లు చేయాలని సిబ్బందికీ మున్సిపల్‌ చైర్మన్‌ రాజమౌళి ఆదేశించారు. బతుకమ్మ దసరాను ప్రశాంతంగా జరుపుకునేందుకు పోలీస్‌, మున్సిపల్‌ సిబ్బంది అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పండగలు ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. ముందుగా గజ్వేల్‌ ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ ప్రజలకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. వారి వెంట కౌన్సిలర్స్‌ తలకోక్కల భాగ్యలక్ష్మి దుర్గ ప్రసాద్‌, పంబాల అర్చన శివకుమార్‌, నాచారం డైరెక్టర్‌ నరేష్‌, వార్డుసభ్యులు తుమ్మ శ్రీను ఉన్నారు.