18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు బతుకమ్మ చీర

నవతెలంగాణ – సిద్దిపేట
తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రములో 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ప్రతియేటా బతుకమ్మ చీరలను కానుకగా అందిస్తుందని 23వ వార్డ్ కౌన్సిలర్ నాయకం లక్ష్మణ్ అన్నారు. రాష్ట్ర మంత్రి  హరీశ్ రావు ఆదేశాల మేరకు,  మున్సిపల్ చైర్మన్ కడవేరుగు మంజుల – రాజనర్సు  సూచనల మేరకు బతుకమ్మ చీరలను గురువారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు సూర్య, నాయకం కరుణాకర్, పబ్బోజి దయాకర్, వార్డ్ ఆఫీసర్ రవి , ఆర్  పి లావణ్య,  వార్డు ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.