బత్తినేని ఛారిటబుల్‌ ట్రస్ట్‌ బీపీ, షుగర్‌ క్యాంపు విజయవంతం

నవతెలంగాణ – బోనకల్‌
మండల కేంద్రంలోని మేఘ శ్రీ హాస్పిటల్స్‌ నందు ప్రతి నెల మొదటి ఆదివారం బత్తినేని చారిటబుల్‌ ట్రస్ట్‌ సౌజన్యంతో అమరజీవి తూము ప్రకాశరావు జ్ఞాపకార్థం నిర్వహించే బీపీ, షుగర్‌, కంటి ప్రత్యేక క్యాంపు శిబిరం ఆదివారం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా వైద్యులు టి పవన్‌ కుమార్‌ మాట్లాడుతూ.. బిపి, షుగర్‌లతో బాధపడేవారు తప్పనిసరిగా మందులను క్రమం తప్పకుండా వాడడం వల్ల బిపి, షుగర్‌ లు అదుపులో ఉంచుకోవచ్చన్నారు. అనంతరం ఈ క్యాంపులో 100 మంది పేషంట్లకు నెలకు సరిపడ మందులను బత్తినేని చారిటబుల్‌ ట్రస్ట్‌ సభ్యులు తూము రోషన్‌ కుమార్‌ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎంపీడబ్ల్యూఎటిఎస్‌ జిల్లా అధ్యక్షులు బొమ్మినేని కొండలరావు, సీపీఐ మండల నాయకులు ఏలూరి పూర్ణచంద్‌, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు ఏనుగు సుమన్‌ బాబు, క్యాంపు నిర్వాహాకులు ఆకెన పవన్‌, సాధనపల్లి ఆమర్‌ నాధ్‌, యంగల గిరి, పండగ గోపి తదితరులు పాల్గొన్నారు.