బొమ్మలరామారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన సేవలు అందించాలని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం బొమ్మలరామారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఐద్వా మండల నాయకత్వంతో కలిసి హాస్పటల్ సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని ఆస్పత్రిని ఎయిమ్స్ వారు దత్తతకు తీసుకున్నరు అయినా ఆస్పత్రిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ప్రభుత్వ లోపం జరుగుతున్నది. ఆస్పత్రిలో మందుల కొరత ఉన్నది సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్న తరుణంలో మందులను అందుబాటులో ఉంచాలని అన్నారు. అదేవిధంగా మండల కేంద్రంలో ఎయిమ్స్ వారు అదనంగా 50 పడకల ఆస్పత్రిని నిర్మాణం చేస్తామని, ఇప్పటికి అది చేయలేదు వెంటనే ఆసుపత్రి నిర్మాణం చేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు బోదాసు నరసమ్మ, పండుగ భారతమ్మ, కేంసారం పోచమ్మ తదితరులు పాల్గొన్నారు.