బీసీ బాలుర గురుకుల పాఠశాల మంజూరు చేయలి

– మంత్రికి వినతి పత్రం అందజేసిన ఏఐఎస్ఎఫ్ నాయకులు

నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ : హుస్నాబాద్ నియోజకవర్గానికి మహాత్మా జ్యోతిరావు పూలే(బీసీ సంక్షేమ)బాలుర గురుకుల పాఠశాలను మంజూరు చేయాలని ఏఐఎస్ఎఫ్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి జేరిపోతుల జనార్ధన్ తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ,రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను హుస్నాబాద్ లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కి హుస్నాబాద్ లోని సంక్షేమ గురుకుల పాఠశాలల గురించి వివరించి,హుస్నాబాద్ బీసీ బాలుర గురుకుల పాఠశాల లేకపోవడం వల్ల విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లి అక్కడ నచ్చక మధ్యలో చదువు ఆపేస్తున్నారని, 4 జిల్లాలకు కేంద్రంగా ఉన్న హుస్నాబాద్ లో మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ బాలుర గురుకుల పాఠశాల తీసుకువస్తే ఇక్కడి విద్యార్థులకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.. ఈ సందర్భంగా మంత్రి సానుకూలంగా స్పందించారని జనార్ధన్ పేర్కోన్నారు .ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రామగళ్ల నరేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ చిట్యాల శేఖర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వేల్పుల ప్రసన్నకుమార్, మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకులు కొమ్ముల భాస్కర్, గణేష్ పాల్గొన్నారు.