క్రీడల్లో సత్తా చాటిన బీసీ బాలుర పాఠశాల విద్యార్ధులు..

– అభినందిస్తున్న ప్రిన్సిపాల్ మంజులు..
నవతెలంగాణ – అశ్వారావుపేట
జిల్లా స్థాయిలో జరిగిన క్రీడా పోటీల్లో అశ్వారావుపేటలో గల  మహాత్మా జ్యోతి బా పూలే వెనుకబడిన తరగతుల బీసీ బాలుర గురుకుల పాఠశాల విద్యార్ధులు సత్తా చాటారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన పలువురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత పొందారు. స్థానిక పాఠశాలలో గురువారం క్రీడా పోటీల్లో విజేతలను పాఠశాల ప్రిన్సిపాల్ కే మంజుల అభినందించారు. ఈ మేరకు ప్రతిభ కనబరిచిన  విద్యార్థుల వివరాలను ఆమె గురువారం వెల్లడించారు.గత నెల 21వ తేది నుంచి 23 వ తేది వరకు,ఈ నెల 2వ తేది నుంచి 4వ తేది వరకు రెండు విడతల్లో జరిగిన జిల్లా స్థాయి స్పోర్ట్ మీట్లో అండర్ – 17 విభాగంలో కబడ్డీ,200 మీటర్లు, 1500 మీటర్లు పరుగు పందెం పోటీల్లో 9వ తరగతి విద్యార్ధి అశోక్ ద్వితీయ స్థానంలో నిలిచాడు. అలాగే రిలే (4X400) లో వరుసగా అశోక్, చరణ్ తేజ్,సందీప్,తేజ రెడ్డి విద్యార్థులు గెలుపొందారు. అండర్ – 14 విభాగంలో 100, 200 మీటర్ల పరుగు పందాల్లో కే రోహిత్ ప్రథమ స్థానం, 600 మీటర్లలో హర్ష నాయక్ అనే షిప్ను ఆశ్వారావుపేట విద్యార్థి ద్వితీయ స్థానం, అథ్లెటిక్స్ ఓవరాల్ ఛాంపియన్ బీసీ గురుకుల పాఠశాల కైవసం చేసుకుందని ఆమె తెలిపారు. జిల్లా స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు అండర్ – 17 విభాగంలో ఖో ఖో లో అశోక్, కబడ్డీ పోటీలో కార్తీక్, చరణ్ తేజ, వాలీబాల్ పోటీల్లో ధీరజ్, 200, 1500 మీటర్ల విభాగంలో అశోక్,అండర్ – 14 విభాగంలో 100, 200 మీటర్ల విభాగంలో కే రోహిత్, 600 మీటర్ల విభాగంలో బీ హర్ష నాయక్, కబడ్డీ లో యు తరుణ్, ఖో ఖో పోటీల్లో శివం ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ చెప్పారు. క్రీడా పోటీ ల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విజేతలను,పాఠశాల పీ.ఈ.టీ టీ వసంత్ ను ఆమె అభినందించారు.