బీసీ గణన పారదర్శకంగా నిర్వహించాలి.

BC calculation should be conducted transparently.– బి రెడ్డి సాంబశివ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు
నవతెలంగాణ-గోవిందరావుపేట
దేశవ్యాప్తంగా చేపట్టిన బీసీ గణన పారదర్శకంగా నిర్వహించాలని సిపిఎం పార్టీ ములుగు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి రెడ్డి సాంబశివ అన్నారు. ఆదివారం సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం సిపిఎం పార్టీ మండల అధ్యక్షుడు సోమ మల్లారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సాంబశివ హాజరై మాట్లాడుతూ బీసీ గణన నిర్వహణకు అదనపు బృందాలను కేటాయించాలని సర్వే సమగ్రంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇల్లు అర్హులైన ప్రతి ఒక్కరికి గ్రామసభల ద్వారా ఎంపిక చేయాలని కోరారు. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం కేటాయించి పక్కా ఇల్లు కట్టించి ఇవ్వాలని అన్నారు. రైతుల రుణమాఫీ విషయంలో ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలని ఒకటేసారి రుణమాఫీ చేయాలని ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచాలని మధ్య దళారుల నుండి రైతులను కాపాడాలని డిమాండ్ చేశారు అందుకోసం సిపిఎం పార్టీ కార్యకర్తలు పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మండల కార్యవర్గ సభ్యులు అంబాల మురళి, తీగల ఆగి రెడ్డి ,గొంది రాజేష్ కడారి నాగరాజు ,గుండు రామస్వామి ,గుండు లెనిన్, కాప కోటేశ్వరరావు, సామ చంద్రారెడ్డి, కందుల రాజేశ్వరి, మంచాల కవిత, సప్పిడి ఆదిరెడ్డి ,కొటం కృష్ణారావు, క్యాతం సూర్యనారాయణ, మహేందర్, గోపిశెట్టి ఐలయ్య, ఎస్డి అంజాద్ పిట్టల అరుణ్, సిరిపెల్లి జీవన్ ,రాజు, ఉపేంద్ర చారి, తదితరులు పాల్గొన్నారు